హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కి కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ సందర్బంగా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఇవాళ ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి హాజరవుతారు. ఈ విద్యుత్ బస్సులను ఆపరేట్ చేయనుంది ఈవీ ట్రాన్స్.
కొత్తగా వచ్చిన 65 విద్యుత్ బస్సులు ఇవాల్టి నుంచి రోడ్లపైకి వస్తాయని తెలిపారు ఎండీ నాగిరెడ్డి. ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపో లో వీటిని కేంద్ర, రాష్ట్ర మంత్రుల, మేయర్ సమక్షంలో ప్రారంభిస్తారు. ఉదయం పది గంటలకు బస్సుల ప్రారంభ కార్యక్రమం పూర్తయింది. ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజు రోజుకు పెరిగి పోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్ టి సి వివిధ రూట్లలో నడుపుతోంది.
ప్రయాణీకులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలతో పాటు అత్యంత సౌకర్యవంతమైన జర్నీ కలిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరమంతటా ఈ విద్యుత్ బస్సులనే నడిపిస్తామని స్పష్టం చేసింది.

















