5G Smartphone : ఢిల్లీ – ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడం, టెక్నాలజీ పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకోవడంతో భారీ ఎత్తున ఆయా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ను ఎంచుకుంటున్నారు. తాజాగా జరిపిన సర్వేలో ఏకంగా 30 కోట్ల మంది 5జీ కస్టమర్లు పెరిగినట్లు తేలింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్. మొత్తం మొబైల్ కస్టమర్స్ లలో 5జీ నెట్ వర్క్ కలిగిన వినియోగదారుల శాతం 24 శాతానికి మించిందని పేర్కొంది. ఈ సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది.
5G Smartphone User Count Sensational
అదేమిటంటే ఒక్కో వినియోగదారుడు ప్రతి రోజూ 5జీ (5G) కనెక్టివిటీతో నెలకు 32 జీబీ కంటే ఎక్కువగా డేటాను వాడుకుంటున్నారని స్పష్టం చేసింది. యూజర్ల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో మొబైల్స్ ను తయారు చేస్తున్నారు. ప్రతి రోజూ 1 జీబీ కంటే పైగా వాడుకుంటున్నట్లు పేర్కొంది.
రోజు రోజుకు కొత్తగా 4జీ నెట్ వర్క్ నుంచి 5జీ నెట్ వర్క్ కు మారే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపింది. ఇదిలా ఉండగా 2030 నాటికి మూడు రెట్లు పెరిగేందుకు ఆస్కారం ఉందని స్పష్టం చేసింది సదరు సంస్థ. దాదాపు 5జీ కస్టమర్స్ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
ఇదే సమయంలో ఇంటర్నెట్ ప్రొవైడర్స్ మధ్య నెలకొన్న పోటీ వాతావరణం కూడా యూజర్స్ కు లాభం చేకూరనుందని పేర్కొంది. కాగా టెస్లా, స్టార్ లింక్ చైర్మన్ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇండియాలో దాని సేవలపై ఉత్కంఠ నెలకొంది. దీని కారణంగా మరింతగా యూజర్లు స్టార్ లింక్ తో కనెక్టివిటీ పొందనున్నారు.
Also Read : Popular Bike Harley Davidson : హార్లే డేవిడ్సన్ బైక్ ను ఇష్టపడే వారికి ఇదొక శుభవార్త
