BRS Party Gets Huge Donations : బీఆర్ఎస్ పార్టీకి రూ. 15 కోట్లు విరాళం

అధికారం కోల్పోయిన త‌ర్వాత వ‌చ్చింది

Hello Telugu - BRS Party Gets Huge Donations

Hello Telugu - BRS Party Gets Huge Donations

BRS Party : హైద‌రాబాద్ : ఈ దేశంలో అత్య‌ధికంగా విరాళాలు అందుకుంటున్న పార్టీలలో భార‌తీయ జ‌న‌తా పార్టీ టాప్ లో కొన‌సాగుతుండ‌గా ప్రాంతీయ పార్టీల ప‌రంగా కేసీఆర్ స్థాపించిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (BRS Party) నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. అయితే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది. ఈ స‌మ‌యంలో పెద్ద మొత్తంలో పార్టీకి విరాళాలు అందిన‌ట్లు తేల్చింది ఎన్నిక‌ల‌ను నిత్యం ప‌రిశీలిస్తున్న ఏడీఆర్ సంస్థ‌. తాజాగా అధికారం కోల్పోవ‌డంతో ఆ పార్టీకి రూ. 15 కోట్లు విరాళాల రూపేణా అందిన‌ట్లు స‌మాచారం. భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ కు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ప్ర‌కారం ఆ పార్టీకి త‌క్కువ మొత్తంలో విరాళాల రావ‌డం విస్తు పోయేలా చేసింది. ఒక ఏడాది కంటే ముందు ఆ పార్టీ రూ. 500 కోట్లు విరాళాల రూపేణా వ‌చ్చాయి. అంత‌లోపే ప‌డి పోయాయి.

BRS Party Gets Huge Donation

ఇదిలా ఉండ‌గా రూ.15.09 కోట్ల విలువైన విరాళాలలో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి రూ.15 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్ నిధుల ద్వారా అందుకోగా మిగిలినవి 2024-25లో వ్యక్తులు అందుకున్నారు.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.495 కోట్లకు పైగా అందుకుంది. మిగిలిన రూ.85 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్ నిధుల ద్వారా వచ్చాయి. 2022-23లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ మొత్తం రూ. 683 కోట్ల విరాళాలను అందుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 14న ఫ‌లితం వెల్ల‌డిస్తారు. ఈ మేర‌కు ఈసీకి బీఆర్ఎస్ త‌మ విరాళాల వివ‌రాల‌ను అంద‌జేసింది ఈసీకి.

Also Read : Minister Kandula Durgesh Interesting Update : ఎర్ర కాలువ పటిష్టతకు చర్యలు : కందుల దుర్గేష్

Exit mobile version