Amaravati Property Festival Interesting : విజయవాడలో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్

సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ

Hello Telugu - Amaravati Property Festival Interesting

Hello Telugu - Amaravati Property Festival Interesting

Amaravati  : విజయవాడ – కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నారెడ్కో సెంట్రల్ జోన్ 11వ అమరావతి (Amaravati) ప్రాపర్టీ ఫెస్టివల్‌ను విజయవాడసి ‘ఏ’ కన్వెన్షన్‌లో సెప్టెంబర్ 19 నుండి 21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విజ‌య‌వాడ‌లోని మాలక్ష్మి ఛాంబర్స్ లో నిర్వహించిన మీడియాతో నిర్వాహ‌కులు మాట్లాడారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ ఎక్స్‌పో గృహ కొనుగోలుదారులు, స్ధిరాస్తి వ్యాపార రంగానికి చెందిన వారికి సంయిక్త వేదికగా నిలవనుంద‌న్నారు.

ఈ ఫెస్టివల్‌లో 60కి పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొనబోతున్నారు. వీరిలో విశ్వసనీయ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఇంటీరియర్స్, బిల్డింగ్ మెటీరియల్ బ్రాండ్లు, ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్లు, బ్యాంకులు ఇతర అనుబంధ సేవల విభాగాలు ఉంటాయి. ఈ ఎక్స్‌పో ద్వారా విజయవాడ, ప్రజా రాజధాని అమరావతి పరిసర ప్రాంత ప్రజలు తమ బడ్జెట్‌కు అనుగుణంగా అన్ని రకాల ఆమోదం పొందిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులను సరి చూసుకుని ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ భాగస్వాములతో నేరుగా చర్చించి తక్షణ సలహాలు పొందవచ్చు. ఇంటీరియర్ సొల్యూషన్స్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండనుండగా, నగర వాసులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు.

Amaravati Property Festival

ఈ సందర్భంగా నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ మాట్లాడుతూ నారెడ్కో 11వ అమరావతి (Amaravati) ప్రాపర్టీ ఫెస్టివల్ ద్వారా పారదర్శకత, ప్రాక్టికల్ ఫైనాన్స్ సపోర్ట్ ఆలంబనగా గృహ కొనుగోలుదారులను క్రమబద్ధమైన మార్గదర్శకత్వం అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. విశ్వసనీయ డెవలపర్లు, స్పష్టమైన ప్రాజెక్ట్ ఆప్షన్లు, తక్షణ ఫైనాన్షియల్ సహాయం అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావటం ప్రాపర్టీ షో ప్రత్యేకత అన్నారు. విజయవాడ-అమరావతి రియల్ ఎస్టేట్ రంగం తదుపరి వృద్ధి దశలోకి అడుగిడుతోందని, ప్రజలు ధైర్యంగా, తగిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అని సందీప్ మండవ పేర్కొన్నారు. అలాగే గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నాలా చట్టం రద్దు, లేఅవుట్ డెవలప్‌మెంట్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ నిబంధనల సడలింపు, విభిన్న అనుమతుల పరంగా వేగవంతమైన మంజూరు వంటి నిర్ణయాలు పరిశ్రమకు మేలు చేశాయని వివరించారు.

Also Read : AP Govt Interesting News : గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

Exit mobile version