తెలుగు రాష్ట్రాల‌లో జైల‌ర్ -2 రూ. 20 కోట్లు వ‌సూలు

తెలుగు రైట్స్ ద‌క్కించుకున్న నిర్మాత నాగ‌వంశీ

hellotelugu-Jailer-2

హైద‌రాబాద్ : స‌న్ నెట్ వ‌ర్క్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం జైల‌ర్ -2. ఈ సినిమా సీక్వెల్. ఇందులో ముఖ్య పాత్ర పోషించాడు త‌లైవా ర‌జ‌నీకాంత్. రెండు తెలుగు రాష్ట్రాల‌లో తెలుగు వెర్ష‌న్ ఈ మూవీ ఆశించిన దానికంటే అత్య‌ధికంగా వ‌సూళ్లు సాధిస్తోంది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ రావ‌చ్చ‌ని అంచ‌నా. జైల‌ర్ -2 తెలుగు రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ ద‌క్కించుకున్నారు. ఆయ‌న ఫుల్ జోష్ లో న్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లు వసూలు చేసింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రజనీకాంత్ వన్ మ్యాన్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది . అందులోని డార్క్ హ్యూమర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎంతో ప్రచారం పొందిన జైలర్ 2 వసూళ్లు మూడవ రోజు కూడా పెరిగాయి . ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 6 కోట్ల షేర్‌ను రాబట్టింది.

మూడో రోజున ఈ సినిమా రూ. 6 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఇది సినిమా పెద్ద విజయం సాధించడానికి మంచి విషయం అని ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కలెక్షన్లు తగ్గాయని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో రోజు రూ. 5 కోట్లకు పైగా వసూలు చేసింది” అని ఒక ఎగ్జిబిటర్ అన్నారు. ప్రీ-రిలీజ్ హైప్‌తో మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేయగ గింది ,రూ. 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది అని ఆయన జోడించారు. రజనీకాంత్ వన్ మ్యాన్ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది . ఆయన హ్యూమర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా తెలుగు ప్రేక్షకులలో రజనీకాంత్ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. వాస్తవానికి, మోహన్ లాల్, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి , జాకీ ష్రాఫ్ వంటి దిగ్గజాల మద్దతుతో వారి ఎంట్రీ, ఎగ్జిట్‌ల గురించి ప్రేక్షకులు ఊహించేలా చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version