Zubeen Garg : అస్సాం : అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే తమ రాష్ట్రానికి చెందిన భూమి పుత్రుడు , ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) సింగపూర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భూపేన్ హజారికా తర్వాత గొప్ప నివాళులు అర్పించారు. వేలాదిగా జనం తరలి వచ్చారు. కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల ప్రపంచ కప్ జరగనుంది. ఈ కప్ ప్రారంభోత్సవంలో అద్భుత గాయకుడు జుబీన్ గార్గ్ కు సంగీత పరంగా నివాళులు అర్పించనున్నట్లు ప్రకటించారు సీఎం. అంతే కాదు ప్రతి ఒక్కరికీ ఉచితంగా టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Zubeen Garg Death – ICC World Cup
షిల్లాంగ్ చాంబర్ గాయక బృందంతో పాటు అంగారాగ్ పాపోన్ మహంత , జోయ్ బారువాతో సహా రాష్ట్రంలోని ప్రముఖ కళాకారులు సంగీత నివాళిని ప్రదర్శిస్తారని అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సీఎం ఆదేశాల మేరకు ప్రకటించింది. మంగళవారం ప్రారంభ మ్యాచ్ కోసం 5,000 ఉచితంగా టికెట్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రారంభోత్సవ వేడుకలో ఇది 40 నిమిషాల ప్రత్యేక ప్రదర్శనగా ఉంటుందని పేర్కొంది. సెప్టెంబర్ 30న భారతదేశం, శ్రీలంక మహిళా జట్లు తలపడనున్నాయి. గౌహతి స్పోర్ట్స్ అసోసియేషన్ ఏసీఏ తరపున ఉచితంగా టికెట్లను పంపిణీ చేస్తామని వెల్లడించింది. క్రీడ , సంస్కృతి ద్వారా ఐక్యత స్ఫూర్తిని గుర్తించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
Also Read : Shaheen -Rauf Disrespect Shocking : జాతీయ గీతాన్ని అగౌరవ పరిచిన షహీన్, రవూఫ్
