Shaheen -Rauf Disrespect Shocking : జాతీయ గీతాన్ని అగౌర‌వ ప‌రిచిన ష‌హీన్, రవూఫ్

ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఘ‌ట‌న

Hello Telugu - Shaheen -Rauf Disrespect Shocking

Hello Telugu - Shaheen -Rauf Disrespect Shocking

Shaheen Rauf : దుబాయ్ : ఓడి పోయినా పాకిస్తాన్ త‌న తీరును మార్చుకోలేదు. ఇప్ప‌టికే భార‌త్ క‌ర‌చాల‌నం చేసేందుకు నిరాక‌రించింది. తాజాగా మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో. ఆయా మ్యాచ్ ల సంద‌ర్బంగా త‌ల‌ప‌డే జ‌ట్ల‌కు సంబంధించి తొలుత మైదానంలో గౌర‌వ సూచకంగా ఆయా జ‌ట్ల దేశాల‌కు చెందిన జాతీయ గీతాల‌ను ఆలాపించ‌డం జ‌రుగుతుంది. ఇది క్రీడా నియ‌మ నిబంధ‌న‌ల‌లో భాగం కూడా. కానీ అందుకు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించారు పాకిస్తాన్ క్రికెట‌ర్లు. ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కు ముందు భార‌త జాతీయ గీతాన్ని పాకిస్తాన్ క్రికెట‌ర్లు ష‌హన్ అఫ్రిది , ర‌వూఫ్ (Rauf) లు అగౌర‌వ ప‌రిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Shaheen Rauf Disrespect National Anthem

ఇదిలా ఉండ‌గా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతం ప్లే అవుతుండగా పాకిస్తాన్ బౌలర్లు షహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కెమెరాలో చిక్కారు. ఈ సందర్భంగా మరో వివాదం చెలరేగింది. టాస్ తర్వాత రెండు జట్లు జాతీయ గీతాల కోసం వరుసలో ఉండగా ఈ చర్య క్రికెట్ అభిమానులు,నెటిజన్ల నుండి విమర్శలకు దారితీసింది. ఉత్కంఠ భరితమైన ఫైనల్‌కు ముందు రెండు జట్లు కరచాలనం చేయడానికి నిరాకరించడం చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. సూపర్ ఫోర్ మ్యాచ్‌లో సంజు సామ్సన్‌ను అవుట్ చేసిన తర్వాత రవూఫ్ ‘ఫైటర్ జెట్’ సంజ్ఞ చేశాడు.

Also Read : BCCI Huge Gift : భార‌త జ‌ట్టుకు బీసీసీఐ రూ. 21 కోట్ల ప్రైజ్ మ‌నీ

Exit mobile version