YS Jagan Shocking Comments : ఉప ఎన్నిక‌లు ర‌ద్దు చేయాలి – జ‌గ‌న్ రెడ్డి

కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నిర్వహించాలి

Hello Telugu - YS Jagan Shocking Comments

Hello Telugu - YS Jagan Shocking Comments

YS Jagan : అమ‌రావ‌తి – రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింద‌ని, పులివెందుల‌, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక‌లలో అధికార పార్టీ రిగ్గింగ్ కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan).
ఉప ఎన్నిక‌లు ర‌ద్దు చేయాల‌ని, తిరిగి కేంద్ర బ‌ల‌గాల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించాల‌న్నారు. వైయస్సార్‌పీపీ ఏజెంట్లు లేకుండా పోలింగ్‌ ప్రక్రియ కొన‌సాగింద‌ని, ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని అన్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి త‌మ వారిని త‌రిమి వేశార‌ని వాపోయారు. పోలీసుల స‌హ‌కారంతో దౌర్జ‌న్యకాండ కొన‌సాగింద‌ని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి (YS Jagan). తాను ప్రజలకు మంచి చేశానని చంద్రబాబు భావిస్తే, తనకే ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉంటే, ఆ ధైర్యం ఉంటే, వెంటనే రెండు ఉప ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పోలింగ్‌ బూత్‌ల్లో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్స్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 15 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, వాటిలో త‌మ‌ పార్టీ ఏజెంట్లను లేకుండా చేశార‌న్నారు.

YS Jagan Shocking Comments on ZPTC by Election

ఏ ఒక్క ఏజెంట్‌ను బూత్‌ దగ్గరకు కూడా పోనీయకుండా ఆపేసి ఎన్నికల రిగ్గింగ్‌ చేశారని ఆరోపించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అసలు ఎన్నికల్లో బూత్‌ ఏజెంట్‌కు సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్‌ అధికారికి చెప్పడం. అలాగే అవే వివరాలు పార్టీకి కూడా చెబుతారు. ఆ బాధ్యతలు ఏజెంట్లకు ఉంటాయి కాబట్టే.. వారికీ హక్కులూ కల్పించడం జ‌రిగింద‌న్నారు. పోలింగ్‌ మొదలవడానికి ముందే ఫామ్‌–12 (వారి అపాయింట్‌మెంట్‌ కోసం పార్టీ ఇచ్చేది)ను అక్కడి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌కు ఇస్తారు. ఆ తర్వాత బూత్‌లో కూర్చుంటాడు. కానీ త‌మ‌ పార్తీ ఏజెంట్ల నుంచి ఆ ఫామ్‌లను టీడీపీ నేత‌లు, పోలీసులు చింపేశార‌ని, ఇదేనా ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించారు.

Also Read : Minister Atchannaidu Innovative : ఆక్వా రైతుల అభ్యున్న‌తికి చ‌ర్య‌లు తీసుకుంటాం

Exit mobile version