Minister Atchannaidu : అమరావతి – రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతామని అన్నారు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). ఆక్వా రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని, దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు. మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన ఆక్వా కల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం వంటి లక్ష్యాలకు తోడ్పాటు అందిస్తామన్నారు.
Minister Atchannaidu Announce
సుంకాల భారంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు మంత్రి . చికెన్ వ్యర్ధాలను చేపల చెరువులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమలు, మత్స్యశాఖలపై ఫోకస్ పెట్టాలన్నారు. రాష్ట్రంలోని మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, రైతుల ఆదాయాన్ని పెంచే విధానాలపై సమగ్రంగా అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో అక్వా కల్చర్ అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) మాట్లాడుతూ మత్స్యశాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపుతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర మత్స్యకారులు, ఆక్వా రైతులు, పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యావరణ, ప్రజారోగ్యం రక్షణ ప్రథమ కర్తవ్యమని, రైతుల సంక్షేమం, ఎగుమతుల ప్రోత్సాహం, కొత్త ఉపాధి అవకాశాల దిశగా రాష్ట్రానికి మైలురాయిగా నిలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. రైతులు ఇకపై APSADA చట్టం కింద తమ ఆక్వా చెరువులను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ విధానం ద్వారా లైసెన్స్ పొందే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రయోజన పథకాలు పొందడానికి ప్రతి అక్వాకల్చర్ రైతు తమ చెరువులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. సముద్ర ఆహార ఎగుమతుల నాణ్యతను, ట్రేసబిలిటీని (Traceability) మెరుగు పరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.
Also Read : Minister Anitha Vangalapudi Alarming : భారీ వర్షం అప్రమత్తం అవసరం
