సంజూ శాంస‌న్ అద్భుత‌మైన కెప్టెన్

క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్

hellotelugu-YuzvedraChahal

ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్. త‌ను చూసిన కెప్ట‌న్ల‌లో శాంస‌న్ వెరీ వెరీ స్పెష‌ల్ అని పేర్కొన్నారు. అతని కింద ఆడటం వల్ల నేను బౌలర్‌గా ఎదగ గలిగానని తెలిపాడు. అంతకు ముందు కెప్టెన్లు డెత్ ఓవర్లలో స్పిన్నర్లను చాలా అరుదుగా విశ్వసించేవారు, కానీ సంజూ శాంస‌న్ నాకు మద్దతు ఇచ్చి ఆ పాత్రను నాకు ఇచ్చాడని చెప్పాడు. ఆ నమ్మకం నాకు డెత్‌లో అత్యధిక వికెట్లు తీయడంలో సహాయ పడిందన్నాడు యుజ్వేంద్ర చాహ‌ల్. త‌న‌తో క‌లిసి ఆడాల‌ని ప్ర‌తి ఒక్క ఆట‌గాడు కోరుకుంటాడ‌ని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నాడు. త‌ను ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడని చెప్పాడు, ఎప్పుడూ ఎవ‌రి ప‌ట్లా జోక్యం చేసుకోడ‌ని అన్నాడు.

అందుకే ప్ర‌తి ఒక్క క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ తో క‌లిసి ఆడాల‌ని అనుకుంటాడ‌ని తెలిపాడు యుజ్వేంద్ర చాహ‌ల్. ముంబైలో త‌ను మీడియాతో మాట్లాడాడు. త‌నంటే నాకు చాలా ఇష్ట‌మ‌ని చెప్పాడు. త‌న‌తో ఆడ‌టం చాలా కంఫ‌ర్ట్ గా ఉంటుంద‌ని పేర్కొన్నాడు. రాబోయే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్బుతంగా రాణించ గ‌ల‌డ‌ని, ఆ న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. అద్బుత‌మైన షాట్స్ ఆడ‌టంలో త‌ను ప్ర‌త్యేక‌త క‌లిగి ఉన్నాడ‌ని పేర్కొన్నాడు. మ్యాచ్ ఆడే స‌మ‌యంలో ప్లేయ‌ర్ల‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడ‌ని, ఎవ‌రి విష‌యంలోనూ జోక్యం చేసుకోడ‌ని తెలిపాడు. అందుకే శాంస‌న్ తో క‌లిసి ఆడాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పు లేద‌న్నాడు.

Exit mobile version