Yuzvendra Chahal : ముంబై : తనను లక్ష్యంగా చేసుకుని మాజీ భార్య ధనశ్రీ వర్మ చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal). తనను మోసం చేశాడని ధనశ్రీ వర్మ పేర్కొన్నడం పట్ల అభ్యంతరం తెలిపారు. ఆమె చేసినవన్నీ పూర్తిగా అబద్దాలేనని పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత మౌనంగా ఉన్న క్రికెటర్ ఉన్నట్టుండి ఇవాళ నోరు విప్పారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు. విడాకుల కోసం ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ ఇద్దరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు భరణం కింద చాహల్ రూ. 4 కోట్లకు పైగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనికి ఒప్పుకున్నాడు చాహల్. ఇదిలా ఉండగా ఇటు మైదానంలో అటు మైదానం వెలుపల చాలా కూల్ గా ఉంటాడు చాహల్.
Yuzvendra Chahal Comments
తన వ్యక్తిగత జీవితంపై తను చేసిన కామెంట్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని భావించిన క్రికెటర్ స్పందించక తప్పడం లేదని పేర్కొన్నాడు. తను మీడియాతో మాట్లాడారు. తను చేసిన కామెంట్స్ పూర్తిగా అబద్దమన్నారు. తాను మోస పోయానే తప్పా మోసం చేయలేదన్నాడు. అది యావత్ సమాజానికి తెలుసన్నారు. దీనికి ప్రతిస్పందనగా తమ సంబంధం ఎంతకాలం ఉందో చూస్తే అలాంటి వాదనలు అర్థరహితమని చాహల్ నొక్కి చెప్పాడు. అందులో దేనిలోనైనా నిజం ఉంటే, నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండేది కాదని, తన ఆరోపణలను గట్టిగా ఖండిస్తున్నానని ఆయన వివరించారు. తాను బహిరంగంగా బురద జల్లకూడదని ఎంచుకున్నానని చెప్పాడు.
Also Read : Palla Srinivasa Rao Fired on YS Jagan : మెడికల్ సీట్లను ప్రైవేట్ కు కేటాయించింది జగనే
