Palla Srinivasa Rao Fired on YS Jagan : మెడిక‌ల్ సీట్ల‌ను ప్రైవేట్ కు కేటాయించింది జ‌గ‌నే

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా

Hello Telugu - Palla Srinivasa Rao Fired on YS Jagan

Hello Telugu - Palla Srinivasa Rao Fired on YS Jagan

Palla Srinivasa Rao : అమ‌రావ‌తి : ఏపీ తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు (Palla Srinivasa Rao) నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై . ప‌దే ప‌దే తమ స‌ర్కార్ ను ల‌క్ష్యంగా చేసుకుని అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ప‌ల్లా శ్రీ‌నివాస రావు గురువారం బ‌హిరంగ లేఖ రాశారు. ఇందులో 18 ప్ర‌శ్న‌లు సంధించారు. ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాల‌న్నారు. త‌న ప్ర‌భుత్వ హ‌యాంలోనే 50 శాతం మెడికల్‌ సీట్లు ప్రైవేటుకు కేటాయించింది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా పెరుగుతాయనేది వాస్త‌వ‌మ‌న్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రైవేట్‌ కోటాకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ జీ.ఓ.నెం: 107, 108,133 లను విడుదల చేశార‌ని, ఇది అబ‌ద్ద‌మా అన్నారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూపాయి కూడా జగన్‌ ప్రభుత్వం ఎందుకు ఖర్చుపెట్టలేదని నిల‌దీశారు. ఖర్చు చేసిన రూ.1550 కోట్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే కాదా అని ఫైర్ అయ్యారు.

Palla Srinivasa Rao Slams YS Jagan

నాలుగేళ్ల జగన్‌ పాలనలో నిర్మాణాలు పూర్తి అయింది కేవలం 18 శాతం మాత్రమేన‌ని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పనిచేస్తే 17 కాలేజీల నిర్మాణాలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందనేది వాస్తవం కాదా? మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు ఇలా ఏళ్లు గడిస్తే 1750 మెడికల్‌ సీట్లు మురిగి పోయే ప్రమాదం లేదా? అలాగే పీజీ సీట్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉన్న విషయం వాస్తవం కాదా అని నిల‌దీశారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. జగన్‌ ప్రభుత్వ విధానం కన్నా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా వస్తాయనేది నిజం కాదా? అలాగే ప్రైవేట్‌ కోటాలో కూడా మరో 110 సీట్లు పెరిగి మొత్తం 220 సీట్లు విద్యార్థులకు అదనంగా వస్తాయన్నారు. పీపీపీ పద్ధతిలో కూడా ఇప్పటి లాగే 50 శాతం మెడికల్‌ సీట్లు ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తారనేది నిజం కాదా? ప్రభుత్వ ఫీజు మాత్రమే ఉంటుందనేది వాస్తవం కాదా అని అన్నారు. కర్నాటకలో 12 మెడికల్‌ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మిస్తున్నార‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌న్నారు.

గంగవరం పోర్టును ప్రైవేటుకు అమ్మేసింది జగన్‌ ప్రభుత్వం కాదా? విశాఖ స్టీలు భూముల్ని ప్రైవేటుకు అమ్మేయమని చెప్పింది జగన్‌ కాదా అని నిల‌దీశారు.

Also Read : Prashant Kishore Shocking Comments : మ‌హాత్మా గాంధీతో సావ‌ర్కర్ ను పోలిస్తే ఎలా..?

Exit mobile version