పార్టీ ఓట‌మి చెందినా జ‌గ‌న్ ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు

వైయ‌స్సార్సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

hellotelugu-SaajjalaRamakrishnareddy

తాడేప‌ల్లి గూడెం: రాష్ట్రంలో పార్టీ ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ జ‌గ‌న్ రెడ్డికి ఆద‌ర‌ణ ఏమాత్రం త‌గ్గ‌లేద‌న్నారు వైయ‌స్సార్సీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి .ప్ర‌జ‌లు ఇచ్చిన‌ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని జ‌నం త‌ల‌రాత‌లు మార్చే గొప్ప పాల‌న అందించిన గొప్ప నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ అని పేర్కొన్నారు. పార్టీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తాడేప‌ల్లి గూడెంలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ నాయ‌కులతో క‌లిసి భారీ కేకును క‌ట్ చేశారు. అనంత‌రం పేద‌ల‌కు చీర‌లు పంపిణీ చేశారు. వేడుక‌ల అనంత‌రం అక్క‌డే ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్రారంభించి ప్ర‌సంగించారు.

కోట్లాది మంది తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య నాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించు కున్నార‌ని చెప్పారు.కార్య‌క‌ర్తలు కాల‌ర్ ఎగ‌రేసి చెప్పుకునే గొప్ప ల‌క్ష‌ణాలున్న నాయ‌కడంటూ ప్ర‌శంసించారు. ఆయ‌న వందేళ్ల‌పాటు ఆయురారోగ్యాల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కే కాకుండా దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యం ఇవ్వాల‌ని కోరుకుంటున్నానన‌ని అన్నారు. త‌మ పాల‌న ద్వారా జ‌నం త‌ల‌రాత‌లు మార్చే పాల‌న అందించిన గొప్ప నాయ‌కుల్లో దివంగ‌త్ వైయ‌స్సార్ తర్వాత వైస్ జ‌గ‌న్ గుర్తుకు వ‌స్తార‌ని చెప్పారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. కూట‌మి ఏడాదిన్న‌ర పాల‌న చూసిన తర్వాత తాము ఏం కోల్పోయామో రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తించారని అన్నారు. ఐదు ద‌శాబ్దాల్లో జ‌ర‌గాల్సిన అభివృద్దిని ఐదేళ్ల‌లో చేసి చూపించారు కాబ‌ట్టే పార్టీ ఓడిపోయినా ఆయ‌న‌కు ప్ర‌జాద‌ర‌ణ ఏమాత్రం త‌గ్గ‌లేదన్నారు.

Exit mobile version