YS Sharmila Fired on AP Govt : ఆరోగ్య‌శ్రీ ఆగి పోకుండా చూడాలి : ష‌ర్మిల‌

పేద‌ల‌ను ఆరోగ్యానికి దూరం చేస్తే ఎలా..?

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : విజ‌యవాడ : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) నిప్పులు చెరిగారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ ప‌థ‌కం అని పేర్కొన్నారు. దివంగత నేత , మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మానస పుత్రిక ఈ పథకం అని , దానిని కావాల‌ని నిర్ల‌క్ష్యానికి గురి చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ అని పేర్కొన్నారు. ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇస్తుంద‌న్నారు. ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ధ్వ‌జ‌మెత్తారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చడం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఏడాదిన్నరగా రూ.2500 వేల కోట్లు బకాయిలు ఆసుపత్రులకు పెండింగ్ పెట్టారంటే ఆరోగ్యశ్రీ అమలుపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో తేట తెల్లమయ్యిందన్నారు. బకాయిల భారం పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

YS Sharmila Slams AP Govt

ఆరోగ్యశ్రీని చంపి యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసమేన‌ని మండిప‌డ్డారు ష‌ర్మిలా రెడ్డి. పథకాన్ని ప్రైవేట్ బీమాతో ముడి పెట్టడం అంటే ప్రజారోగ్యానికి ఎసరు పెట్టడమేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారు. ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరి పెడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు అని ప్ర‌శ్నించారు. ఎవరిపై ఈ క‌క్ష‌, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు..ఎవ‌రి లాభం , ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

Also Read : US-India Trade Talks Sensational : నేడు అమెరికా-భారత్ మద్య వాణిజ్య ఒప్పందాలు కుదిరేనా?

Exit mobile version