YS Sharmila : విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ కూటమి సర్కార్ పనితీరుపై. దివ్యాంగుల పట్ల కనికరం లేక పోవడం దారుణమన్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గం ఆని ఆవేదన చెందారు. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయం అన్నారు . గత 20 ఏళ్ల నుంచి పెన్షన్ పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గు చేటు అని పేర్కొన్నారు ఏపీపీసీసీ చీఫ్. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదన్నారు. బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదేనని, వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించ దగ్గదేనని అన్నారు.
YS Sharmila Slams AP Govt
దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై, ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్దతి కాదన్నారు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదన్నారు. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోందన్నారు. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయాలని అన్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read : PM Modi Strong Response : అమెరికా సుంకాలపై ఘాటుగా స్పందించిన భారత ప్రధాని

















