YS Sharmila Fired on AP Govt : రైతుల గోస ప‌ట్ట‌ని స‌ర్కార్ : ష‌ర్మిల‌

ఎరువులు అంద‌క నానా ఇక్క‌ట్లు

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

Hello Telugu - YS Sharmila Fired on AP Govt

YS Sharmila : అమ‌రావ‌తి – ఏపీ స‌ర్కార్ పై తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం అన్నారు. ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటి వ్యధ క‌నిపిస్తోంద‌న్నార. తెల్లవారు జామునుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ క్యూలు క‌ట్టార‌ని, కట్ట యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూపులు చూడాల్సి వ‌స్తోంద‌న్నారు. ఆదివారం ష‌ర్మిల (YS Sharmila) మీడియాతో మాట్లాడారు.

YS Sharmila Slams AP Govt

ఇదేనా ప్రభుత్వానికి రైతాంగం మీదున్న చిత్తశుద్ధి ? ఎరువుల కోసం రైతులను అరిగోస పెట్టడమా రైతు పక్షపాతి అంటే ? బీజేపీకి మద్దతు ఇచ్చిన రాష్ట్రంలో రైతు సేవా, మార్క్ ఫెడ్ , సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డ్ లు పెట్టడానికి సిగ్గుండాల‌ని మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వానిది సాగుకు పెద్దపీట కాదు…రైతు మెడమీద కత్తిపీట అని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర కోటా మేరకు యూరియా వస్తే మరి ఆ ఎరువులు ఏమైనట్లు ? 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంటే రైతులకు ఎరువు కరువు ఎందుకు క‌లుగుతోంద‌ని ప్ర‌శ్నించారు ష‌ర్మిలా రెడ్డి. రైతులకు చేరాల్సిన యూరియా ఏ దారి మళ్లిందని ప్ర‌శ్నించారు. ఎవరి గోడౌన్లకు అక్రమంగా యూరియా తరులుతోందన్నారు. అక్రమ రవాణాపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ నిద్ర పోతుందా ? 266 రూపాయలు అమ్మాల్సిన బస్తా ధర బహిరంగ మార్కెట్ లో 500 రూపాయలకు ఎందుకు అమ్ముతున్నారు ? ఇది నిజంగా కొరతనా.. లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్తిమ కొరతనా ? సీఎం చంద్రబాబు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : Popular Cricketer Pujara Retirement : క్రికెట‌ర్ చ‌తేశ్వ‌ర్ పుజారా రిటైర్మెంట్

Exit mobile version