YS Sharmila : అమరావతి – పీఎం మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. యోగా చేసి తను తృప్తి పడితే సరిపోదని, రాష్ట్ర ప్రజలంతా తృప్తి పడేలా ఒక్క ప్రకటన అయినా చేశారా అని ప్రశ్నించారు. విభజన హామీల ఊసే ఎత్తడం లేదని, అయినా ప్రధాని భజన చేయడంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు బిజీగా మారారని ఆరోపించారు. వివేకా ను చంపి సునీత మీద నెట్టేసినోళ్ళకు,
సింగయ్యను తొక్కి చంపి AI గ్రాఫిక్స్ అనడం ఒక లెక్కనా అంటూ మండిపడ్డారు.
YS Sharmila Shocking Comments
రాష్ట్ర రాజకీయాలు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం షర్మిలా రెడ్డి (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ఉన్న పార్టీలు అన్ని మోడీ తొత్తులేనని ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరు మోడీ జపం చేయడంలోనే తపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోడీకి యోగా మీద ఉన్న శ్రద్ద ఏపీ రాష్ట్రంపై లేదన్నారు. ఎవరు మిమ్మల్ని యోగా చేయమని చెప్పారో ఒక్కసారి ఆలోచించు కోవాలన్నారు.
మీరు ఇచ్చిన హామీల మీద ఏపీ రాష్ట్ర ప్రజలు తృప్తిగా లేరని పేర్కొన్నారు. ఢిల్లీకి మించి రాజధాని కడతామని జిమ్మిక్కులు చేశారంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారంటూ ప్రజలపై భారం పడడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు.
Also Read : Deputy CM Pawan Kalyan Success : డబుల్ ఇంజన్ సర్కార్ సూపర్
















