YS Sharmila Fired on CM Chandrababu : అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ దందా

చంద్ర‌బాబు నాయుడుపై భ‌గ్గుమ‌న్న ఏపీపీసీసీ చీఫ్

Hello Telugu - YS Sharmila Fired on CM Chandrababu

Hello Telugu - YS Sharmila Fired on CM Chandrababu

YS Sharmila : విజ‌య‌వాడ : ఏపీ స‌ర్కార్ పై, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందని ఆరోపించారు. తొలి విడతలో ప్రభుత్వ భూములతో కలిపి 54 వేల ఎకరాల్లో అభివృద్ధి జరిగి పోయిందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని అన్నారు. ఇంకా అక్కడ భూమి లేనట్లుగా, అదనంగా మరో 44 వేల ఎకరాలు సేకరణకు సిద్ధమవుతున్నారని మండిప‌డ్డారు.“మున్సిపాలిటీ కావాలా? అంతర్జాతీయ రాజధాని కావాలా?” అని చంద్రబాబు అడుగుతుండ‌డం దారుణ‌మ‌న్నారు. 54 వేల ఎకరాల్లో మున్సిపాలిటీ గురించే ఇప్పుడు మాట్లాడటమేంటి? 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను వెన్నుపోటు పొడవటం కాదా అని నిల‌దీశారు బాబును. ఈ మేర‌కు రైతులకు సీఎం సమాధానం చెప్పాలని డిమాడ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.

YS Sharmila Slams CM Chandrababu

మంత్రి నారాయణ 700 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని చెబుతుంటే అసలు ఎంత భూమిని ఎవరికి కేటాయించారు? భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు విభజించి ఇచ్చారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నించారు . .రాజధానికి సంబంధించిన 54 వేల ఎకరాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మింగడానికి మెతుకు లేదు గాని ఇన్ని వేల కోట్ల అవసరమా? అమరావతిపై చంద్రబాబుకే చిత్తశుద్ధి లేకపోతే, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? భూములు ఇచ్చిన వారికీ న్యాయం చేయకుండా, ఇప్పుడు కొత్తగా మళ్లీ రైతులను బాధితులుగా మారుస్తారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమరావతి తొలి దశ భూములపై శ్వేతపత్రం ఇవ్వాలని అన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు ష‌ర్మిలా రెడ్డి.

Also Read : DY CM Bhatti Vikramarka Important Update : విద్యుత్ స‌ర‌ఫ‌రా కోసం ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు

Exit mobile version