YS Sharmila : విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ బిడ్డలకు అక్షర జ్ఞానం అందించలేని కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. గిరిజన విద్యకు మహర్దశ, పెద్దపీట లాంటి ఆర్భాటాలు కేవలం మాటల వరకే పరిమితం చేశారంటూ ప్రశ్నించారు.పెద్దపీట కాదు ట్రైబల్ వెల్ఫేర్ పై మీరేసింది కత్తిపీట బిగించారంటూ ఆరోపించారు. మంత్రులుగా మహర్దశ మీకు కానీ గిరిజన బిడ్డలకు కాదన్నారు. పాఠశాలలు తెరుచుకొని మూడు నెలలు దాటినా ఏజెన్సీ ప్రాంతాల్లోని బడుల్లో కనీసం ఒక్క ఉపాధ్యాయుడు లేడంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా అని నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
YS Sharmila Slams AP Govt
విద్యాశాఖ పని చేస్తున్నట్లా? నిద్ర పోతున్నట్లా అని మండిపడ్డారు. గిరిపుత్రుల విద్యోన్నతికి కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని ఆరోపించారు. వెలుగుల పేరుతో గిరిజన విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు లేక, చదువులు సాగక రాష్ట్రంలో గిరిజన విద్య కుంటు పడిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, డీఎస్సీ నియామకాలు పూర్తయ్యే వరకు ఆదివాసీ బిడ్డలకు చదువులు దూరం చెయ్యడం తగదన్నారు. ఖాళీలను భర్తీ చేసే దాకా విద్యా వాలంటీర్లను నియమించి చదువులు సాగేలా చూడాలని సూచించారు సర్కార్ కు. పాడేరు, అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 70 స్కూళ్ళలో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : PM Modi New Innovation : మిజోరంలో రైల్వే లైన్ ను ప్రారంభించిన మోదీ















