YS Sharmila Shocking Comments : యూనివ‌ర్శిటీ విద్యార్థుల‌కు న్యాయం చేయండి

వైఎస్సార్ ఆర్కిటెక్చ‌ర్ విద్యార్థులకు ష‌ర్మిల అండ

Hello Telugu - YS Sharmila Demands

Hello Telugu - YS Sharmila Demands

YS Sharmila : విజ‌య‌వాడ – క‌డ‌ప జిల్లాలోని వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆర్కిటెక్చ‌ర్ విశ్వ విద్యాల‌యం విద్యార్థులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila). యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన COA అధికారులను విజయవాడలో కలిశారు. గత ప్రభుత్వ హయంలో COA అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేశారని ఆరోపించారు. ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

YS Sharmila Comment Aboutr YSR Architecture University

గ‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలోని వైస్సార్ స‌ర్కార్ ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా వందలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయన్నారు. COA అనుమతులు లేకుండా లైసెన్సులు రావడం లేదన్నారు. విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వాపోయారు ఏపీపీసీసీ చీఫ్‌.

ఈ విద్యార్థులు ప‌డుతున్న‌ కష్టాలు తాను ప్రత్యక్షంగా చూశాన‌ని అన్నారు. ఆనాడు అనుమతులు లేకుండా యూనివర్సిటీ ప్రారంభించడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు. ఈ తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. రెండేళ్లుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నా ఫలితం లేదన్నారు. వెంటనే COA అనుమతులు తీసుకొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో COAను కలుస్తాం అని హెచ్చరించామ‌న్నారు.

ఒక నెల గడువు ఇచ్చామ‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ తప్పును సరిద్దుతున్నాం అని హామీ ఇచ్చారని తెలిపారు. నెల రోజుల్లో YSR యూనివర్సిటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్తామని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామ‌ని అన్నారు.

Also Read : YS Sharmila Shocking Comments : యూనివ‌ర్శిటీ విద్యార్థుల భ‌విష్య‌త్ అగ‌మ్య గోచ‌రం

Exit mobile version