YS Sharmila Strong Demand : బ‌ల్క్ డ్ర‌గ్ ఏర్పాటు మానుకోవాలి : ష‌ర్మిల

మ‌త్స్య‌కారుల ఆవేద‌నలో న్యాయం ఉంది

Hello Telugu - YS Sharmila Strong Demand

Hello Telugu - YS Sharmila Strong Demand

YS Sharmila : విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా ఎడ్డి (YS Sharmila) ఏపీ కూట‌మి స‌ర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి మత్స్యకారులు గ‌త కొంత కాలంగా చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంద‌న్నారు. కానీ వారి ఆవేద‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. వారి ఆందోళనల‌పై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై పునరాలోచన చేయాలని సూచించారు. ⁠డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే వాయు, జల కాలుష్యం పెరుగుతుందని, క్యాన్సర్ల బారిన పడతామని, ప్రాణాలు పోతాయని మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నార‌ని వాపోయారు ష‌ర్మిలా రెడ్డి.

YS Sharmila Demands

ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. వారి ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ⁠డ్రగ్ పార్క్ ఏర్పాటుపై తక్షణం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు . అఖిలపక్షాన్ని పిలిచి చర్చించాలన్నారు ఏపీపీసీసీచీఫ్ .ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పరిశ్రమలు పెట్టి ప్రాణాలు తీస్తాం అంటే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. మత్స్యకారుల ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల నుంచి మ‌రింత వ్య‌తిరేక‌త రాక ముందే తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోరారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

Also Read : Rahul Gandhi Strong Demand : ల‌డ‌ఖ్ కాల్పుల‌పై విచార‌ణ జ‌రిపించాలి

Exit mobile version