YS Sharmila : విజయవాడ : ప్రభుత్వ నిర్లక్ష్యం దూది రైతుకు దుఃఖం తెచ్చి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). మక్క రైతుల రెక్కలు విరుస్తోందన్నారు. మద్దతు ధర లేక రాష్ట్రంలో పత్తి రైతు చిత్తు అవుతుంటే, మొక్కజొన్న రైతులు విల విల లాడి పోతున్నారని పేర్కొన్నారు. మోంతా తుఫాను ధాటికి దిగుబడి తగ్గి రైతు దిగాలు పడుతుంటే.. చేతికొచ్చిన అరకొర పంటకైనా గిట్టుబాటు ధర పెట్టకుండా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. పొలం మీదే పంటలకు రైతులు నిప్పు పెడుతుంటే రైతు సుభిక్షం లాంటి మాటలు చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
YS Sharmila Demands AP Govt
క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర రూ.8110 ఉంటే మార్కెట్ లో గరిష్టంగా రూ.7వేలు రావడం లేదని ఆరోపించారు. వర్షాలకు రంగు మారిందని, తేమ ఉందని, పురుగు సోకిందని కొర్రీలు పెట్టడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు షర్మిలా రెడ్డి. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టీ పత్తి పండిస్తే 6 క్వింటాలు కూడా దిగుబడి రాలేదని, మార్కెట్ ధరతో పోల్చితే ఇంకా రూ 10 వేలు నష్టమే వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర రూ. 2400 ఉండగా మార్కెట్ లో ధర రూ. 1400 కూడా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. తుఫాను ప్రభావంతో ఎకరాకు దిగుబడి 10 క్వింటాలకు తగ్గితే, రూ.35వేలు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి రూ.20వేల కన్నా ఎక్కువ లేకపోవడం ఆందోళనకరం అన్నారు.
పత్తి, మొక్కజొన్నే కాదు.. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఏ పంటకు మద్దతు ధర లేదన్నారు. మిరపకు రూ.12 వేలు మద్దతు ధర ఉంటే రైతుకి దక్కింది రూ.6 వేలే. వేరుశెనగకు రూ.8వేలు ఉంటే రైతుకి ఇచ్చింది రూ.4 వేలు. కంది పంటకు మద్దతు ధర మీద రూ.2 వేలు నష్టం. పెసరకు రూ. 3500 నష్టం. మినుములకు క్వింటాకు రూ. 14 వందల నష్టం. పొగాకు పంట క్వింటాకు రూ.13వేల నష్టానికి, ఉల్లి గడ్డ కిలో 4 రూపాయలకు అమ్ముకున్న దుస్థితి నెలకొందన్నారు.
Also Read : Speaker Gaddam Prasad Clear Update : 19, 20 తేదీల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
