YS Sharmila Shocking Comments in PM Modi : మోదీ చేతిలో ఎన్నిక‌ల సంఘం కీలుబొమ్మ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వైఎస్ ష‌ర్మిల

Hello Telugu - YS Sharmila Shocking Comments in PM Modi

Hello Telugu - YS Sharmila Shocking Comments in PM Modi

YS Sharmila : అమ‌రావ‌తి : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఓట్ల చోరీ జ‌రిగింది వాస్త‌వ‌మేన‌ని అందుకే అడ్డ‌గోలుగా న‌కిలీ ఓట్ల‌తో ఆయా రాష్ట్రాల‌లో బీజేపీ, ఎన్డీయే కూట‌మి గ‌ద్దెనెక్కాయంటూ మండిప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆధారాల‌తో స‌హా త‌మ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ బ‌య‌ట పెట్టార‌ని ఇప్పుడు ఎందుకు న‌రేంద్ర మోదీ, అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్లు నోరు మెద‌ప‌డం లేదంటూ ప్ర‌శ్నించారు ష‌ర్మిల‌ (YS Sharmila). ఇలా ఇంకెంత కాలం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారంటూ నిల‌దీశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నింటిని గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు.

YS Sharmila Slams PM Modi

ప్ర‌స్తుతం బీహార్ లో జ‌ర‌గ‌బోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ కొన‌సాగింద‌ని ఆరోపించారు ష‌ర్మిల‌. వీట‌న్నింటి వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకు గాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. 26 జిలాల్లో 175 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు ఓట్ల చోరీపై అన్ని వివరాలను సవివరంగా వివరించడం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు న‌రేంద్ర మోదీ సాగించిన ఈ ఓట్ల చోరీపై మౌనంగా ఉండ‌ర‌ని హెచ్చ‌రించారు. వాస్త‌వాలు వెల్ల‌డ‌య్యేంత దాకా తాము ఊరుకునేది లేద‌న్నారు ష‌ర్మిల‌.

Also Read : President Murmu Important Comments : విశ్వ విజేత‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము కంగ్రాట్స్

Exit mobile version