YS Rajasekhar Reddy Death Anniversary : సెప్టెంబ‌ర్ 2న వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి

మూడు రోజుల పాటు జ‌గ‌న్ పులివెందుల లోనే

Hello Telugu - YS Rajasekhar Reddy Death Anniversary

Hello Telugu - YS Rajasekhar Reddy Death Anniversary

YS Rajasekhar Reddy : వైఎస్సార్ క‌డ‌ప జిల్లా – వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు , మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మూడు రోజుల పాటు పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సెప్టెంబ‌ర్ 1, 2, 3 తేదీల‌లో ప‌లు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. త‌న తండ్రి, దివంగ‌త ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వ‌ర్ధంతి సెప్టెంబ‌ర్ 2న జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ రెడ్డి తో పాటు ఆయ‌న భార్య భార‌తీ రెడ్డి, కుటుంబీకులు హాజ‌ర‌వుతారు. త‌ల్లి వైఎస్ విజ‌యమ్మ‌తో పాటు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి పాల్గొంటారు.

YS Rajasekhar Reddy Death Anniversary

ఇదిలా ఉండ‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి వైఎస్ఆర్సీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబ‌ర్ 1న సోమ‌వారం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల కు చేరుకుంటారు. అక్క‌డ భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు మాజీ సీఎం.

2వ తేదీ మంగ‌ళ‌వారం జ‌గన్ మోహ‌న్ రెడ్డి పులివెందుల‌లోని త‌న నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లింగాల మండలం అంబకపల్లి చేరుకుని గంగమ్మ కుంట వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. సెప్టెంబ‌ర్ 3వ తేదీన బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు పులివెందుల నుంచి తిరుగు ప‌య‌న‌మ‌వుతారు.

Also Read : Popular Leader Paritala Ravi : అరుదైన ప్ర‌జా నాయ‌కుడు ప‌రిటాల ర‌వి

Exit mobile version