YS Jagan Fired on AP Govt : వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం అమ్మ‌కం : జ‌గ‌న్

ఏపీ కూట‌మి స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్

Hello Telugu - YS Jagan Fired on AP Govt

Hello Telugu - YS Jagan Fired on AP Govt

YS Jagan : తాడేప‌ల్లిగూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. వ్యవస్థీకృత పద్ధతిలో అక్రమ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ రకమైన మద్యం మాఫియా ప్రపంచ చరిత్రలోనే లేద‌న్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయని అన్నారు. వారు తయారు చేసిన నకిలీ మద్యాన్ని వారి షాపుల్లోనే (మాఫియా చేతుల్లో ఉన్న షాప్‌లు) అమ్ముతున్నారని మండిప‌డ్డారు. ఇంకా పర్మిట్ రూమ్‌ల్లోనూ, బెల్టు షాపుల్లోనూ అమ్ముతున్నార‌ని పేర్కొన్నారు. గురువారం జ‌గ‌న్ రెడ్డి (YS Jagan) మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం ప‌ణంగా పెడుతున్నార‌ని, వేల కోట్లు దండుకుంటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వాటాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం బయట పడింద‌ని అన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువుతో పాటు, ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం రాకెట్ బయట ప‌డింద‌న్నారు. 27,224 బాటిళ్లు దొరికాయ‌న్నారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు నకిలీ మద్యం బయట పడిందన్నారు.

YS Jagan Slams AP Govt

రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు తయారు చేశారని ఆరోపించారు. వాళ్ల మాఫియా చేతుల్లో ఉన్న షాపులకు సరఫరా చేశార‌ని అన్నారు. రెండేళ్ల నుంచి ఈ దందా కొనసాగుతుండగా, వాటాల్లో తేడా వచ్చి వ్యవహారం బయట పడడంతో, దాన్ని నెపాన్ని వేరే వారిపై మోపార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి. నకిలీ మద్యం వెనక ఉన్నది టీడీపీ ఇన్‌ఛార్జ్ అయిన‌ టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి అని బ‌య‌ట ప‌డింద‌న్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ కూడా చేశాడని, మరో వ్యక్తి జనార్థన్‌రావు. మరో వ్యక్తి సురేంద్రనాయుడు. వీరంతా ఒక మాఫియా అని ఆరోపించారు. వారు గత ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేశారని పేర్కొన్నారు. ఇదే జనార్థన్‌రావు విదేశాల్లో ఉండి, రెండు రోజుల్లో వచ్చి రెండు రోజుల్లో లొంగిపోతాడని ఎల్లో మీడియాలో ముందే ఊదరగొట్టారని పేర్కొన్నారు. ఇక‌ తాను రెండేళ్ల నుంచి దందా చేస్తున్నట్లు, దాని వెనక వైయస్సార్‌సీపీ నాయకుడు ఉన్నట్లు దుష్ప్రచారం చేశార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : K Kavitha Sensational Comments : ప్ర‌జ‌లు కోరుకుంటే రాజ‌కీయ పార్టీ పెడతా

Exit mobile version