YS Jagan Fired on CM Chandrababu : చంద్రబాబు పాల‌న‌లో రైతులు ఆగ‌మాగం

ఉల్లి, చెరకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

Hello Telugu - YS Jagan Fired on CM Chandrababu

YS Jagan : క‌డ‌ప వైఎస్సార్ జిల్లా – వైసీపీ బాస్ , మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఏపీలో కొలువు తీరిన చంద్ర‌బాబు పాలన గురించి. స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా రైతులు ఆగమాగం అవుతున్నార‌ని వాపోయారు. పూర్తిగా రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంబిస్తూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు .మంగ‌ళ‌వారం ఉల్లి, చెరకు రైతులతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. రైతులను సంకీర్ణ ప్రభుత్వం మోసం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. గిట్టుబాటు ధ‌ర ఇవ్వ‌డంలో స‌ర్కార్ ఘోరంగా విఫ‌లం అయ్యింద‌న్నారు. త‌ప్పుడు వాగ్దానాల‌తో మ‌భ్య పెట్ట‌డం మానుకోవాల‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు దొరుకుతున్నాయ‌ని పేర్కొన్నారు. యూరియా, మందుల కోసం రైతులు రోడ్డెక్కార‌ని అయినా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

YS Jagan Slams CM Chandrababu

అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగా రైతుల‌కు అవ‌స‌ర‌మైన యూరియా, మందులు దొర‌క‌డం లేద‌ని వాపోయారు. పులివెందుల పర్యటన సందర్భంగా, జగన్ మంగళవారం ఉదయం తాళ్లపల్లెకు చెందిన ఉల్లి, చెరకు రైతులను కలిశారు. ఈ సంద‌ర్బంగా వారు తమ బాధలను వ్యక్తం చేశారు. పొలాల్లో పండిన ఉల్లి పంటను పరిశీలించిన తర్వాత, జగన్ రైతులకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ సంకీర్ణ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క పంటకు కూడా న్యాయమైన ధర లభించడం లేద‌న్నారు. రైతులు తమ కూలీ ఖర్చులను కూడా తిరిగి పొందడం లేదన్నారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20,000 హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.

Also Read : PM Modi New Innovation : 2500 విదేశీ ప్రతినిధులతో సెమికాన్ ఇండియా 2025 ను ప్రారంభించనున్న మోదీ

Exit mobile version