Youtube : అమెరికా – ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థకు చెందిన యూట్యూబ్ లో కీలక మార్పులు తీసుకు వచ్చింది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ (Youtube) చర్యలు చేపట్టింది. ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారివీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది. ఈ కొత్త రూల్స్ ఇవాల్టి నుంచి అమలు లోకి వస్తాయని తెలిపింది.
Youtube New Rules Shocking
జూలై 15 నుండి AI లేదా పునరావృత కంటెంట్ ఉండదని స్పష్టం చేసింది. భారీగా ఉత్పత్తి చేయబడిన, ప్రామాణికం కాని లేదా తక్కువ-ప్రయత్న కంటెంట్ కోసం మానిటైజేషన్‌ను నిరోధించడానికి YouTube దాని భాగస్వామి ప్రోగ్రామ్ నియమాలను నవీకరిస్తుంది. అర్హత కలిగి ఉండటానికి సృష్టికర్తలు అసలు వీడియోలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. వీడియోల నుండి డబ్బులు సంపాదించాలనుకునే సృష్టికర్తలు ఇప్పుడు అసలు, ప్రామాణికమైన కంటెంట్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. లేకపోతే మానిటైజేషన్ కోల్పోతారని హెచ్చరించింది.
ఇందుకు సంబంధించి క్రియేట్ చేసిన కంటెంట్ వాస్తవానికి దగ్గరగా ఉందా లేక ఎక్కడి నుంచైనా కాపీ చేశారా, ఏఐతో జనరేట్ చేశారా అన్న దానిపై ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తుందని, ఇందుకు సంబంధించిన టూల్ ను తయారు చేశామని వెల్లడించింది గూగుల్. ఇదిలా ఉండగా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ప్రతి రోజూ లక్షల కొద్దీ యూట్యూబ్ వేదికగా అప్ లోడ్ చేస్తున్నారని గుర్తించింది. దీంతో భారీ ఎత్తున డబ్బులు పే చేయాల్సి వస్తుండడంతో అసలు కంటెంట్ పక్కకు వెళుతోందని గ్రహించిన గూగుల్ వెంటనే చెక్ పెట్టేందుకు రెడీ అయ్యింది.
Also Read : Vitamin B12 Shocking : విటమిన్ బి12 లోపిస్తే మనిషికి అంత ప్రమాదమా?
