Youtube : యూట్యూబ్ వేదికగా కంటెంట్ తయారీదారులకు ముఖ్యమైన హెచ్చరిక వచ్చింది. పునరావృత (రీయూజ్డ్) కంటెంట్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ (Youtube) కొత్త విధానాన్ని ప్రకటించింది. జూలై 15, 2025 నుండి యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) లో మార్పులు అమల్లోకి రానున్నాయి.
Youtube – ఈ మార్పుల ప్రకారం,
- యూట్యూబ్ ఒరిజినల్, సృజనాత్మక కంటెంట్‌ను మాత్రమే ప్రోత్సహించనుంది.
- ఇతరుల వీడియోల్ని కట్ చేసి లేదా స్వల్ప మార్పులతో మళ్లీ అప్‌లోడ్ చేసిన వీడియోలు ఇక ఆదాయానికి అర్హత కలిగి ఉండవు.
- క్లిక్‌బైట్ టైటిల్స్, తప్పుదారి పట్టించే థంబ్నెయిల్స్, తక్కువ నాణ్యత కలిగిన వీడియోలూ మానిటైజేషన్‌కు అర్హత పొందవు.
- రియాక్షన్ మాషప్‌లు, ఏఐ స్లైడ్ షోలు, మూడో పక్ష కంటెంట్ ఆధారంగా రూపొందించిన వీడియోలు కూడా నిరాకరించబడతాయి.
మానిటైజేషన్‌కు అర్హత కలిగే వీడియోల లక్షణాలు:
- విద్యాపరమైన సమాచారం ఉండాలి
- వినోదాత్మకంగా, ప్రామాణికంగా ఉండాలి
- ఒరిజినల్ వాయిస్, విజువల్స్ ఉండాలి
- వీక్షకులకు విలువనిచ్చే విధంగా ఉండాలి
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో చేరాలంటే:
- కనీసం 1,000 సబ్‌స్క్రైబర్లు
- గత 12 నెలల్లో 4,000 వాచ్ అవర్స్ ఉండాలి
- కంటెంట్ పూర్తి స్థాయిలో ఒరిజినల్ అయి ఉండాలి
ఈ మార్గదర్శకాలు వలన నిజమైన కంటెంట్ క్రియేటర్లకు ప్రోత్సాహం లభించనుంది. ప్లాట్‌ఫామ్‌ను దుర్వినియోగం చేసే ప్రయత్నాలు తగ్గిపోవచ్చని యూట్యూబ్ చెబుతోంది. సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చే కొత్త యుగానికి ఇది నాంది కావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read : YS Jagan Sensational Tweet : ఎన్డీఏ సర్కార్ పై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్



















