Vinayak Immersion Sensational : మ‌హా నిమ‌జ్జ‌నోత్స‌వానికి త‌ర‌లిన గ‌ణ‌నాథులు

బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు శోభాయాత్ర

Hello Telugu - Vinayak Immersion Sensational

Hello Telugu - Vinayak Immersion Sensational

Vinayak : హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రం శోభాయ‌మానంగా మారి పోయింది. ఎక్క‌డ చూసినా గ‌ణ‌నాథులు వీనుల విందుగా మారాయి. మ‌హా నిమ‌జ్జ‌నోత్స‌వానికి త‌ర‌లి వెళుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయిలో గణేశుడి ల‌డ్డూలు ధ‌ర‌కు అమ్ముడు పోయాయి. రాజేంద్ర న‌గ‌ర్ లోని రిచ్ మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన వినాయ‌కుడి వ‌ద్ద పెద్ద ఎత్తున వేలం పాట జ‌రిగింది. ఏకంగా రూ. 1.82 కోట్ల‌కు అమ్ముడు పోయింది. మ‌రో వైపు ఖైర‌తాబాద్ , బాలాపూర్ ల‌లో వినాయ‌క విగ్ర‌హాల వ‌ద్ద ల‌డ్డూల వేలం కొన‌సాగింది. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 6న శ‌నివారం గ‌ణ‌ణాతులు నిమ‌జ్జ‌నానికి త‌ర‌లి వ‌స్తున్నాయి. భారీ ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.

Vinayak Immersion Today

తాజాగా ఖైరతాబాద్‌ మహా గణపతికి కలశ పూజ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ , టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ద‌ర్శించుకున్నారు. గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ గ‌ణ‌నాథుడు త‌ర‌లి వెళుతుండ‌డంతో భ‌క్తులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. కలశ పూజ నిర్వహించారు కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్. మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా ట్యాంక్‌ బండ్‌ వరకు చేరుకోనుంది. ఇదిలా ఉండ‌గా గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన‌ట్లు సీపీ సీవీ ఆనంద్. ఇవాళ ఉద‌యం 6 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ ఆదివారం ఉద‌యం 10 వరకు ఆంక్షలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Harish Rao Fired on Kavitha : క‌ల్వ‌కుంట్ల క‌విత కామెంట్స్ బ‌క్వాస్ : హ‌రీశ్ రావు

Exit mobile version