ముంబై : ఉత్కంఠ భరితమైన ఫైనల్ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్రిమీయర్ లీగ్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. తన సమీప ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 8 పరుగుల తేడాతో ఓడించింది. విజేతగా నిలిచింది. మహిళా ప్రిమీయర్ లీగ్ లో ఒక సీజన్ లో 500 రన్స్ చేసిన తొలి ప్లేయర్ గా నాట్ స్కైవర్ బ్రంట్ చరిత్ర సృష్టించింది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో మొత్తం 7 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి దాకా పోరాడింది. కానీ టార్గెట్ చేయడంలో విఫలమైంది. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. కానీ 9 వికెట్లు కోల్పోయి 141 రన్స్ కే పరిమితమైంది.
ఇంగ్లండ్ కు చెందిన ఆల్ రౌండర్ ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడింది. తన సత్తా ఏమిటో చూపించింది. అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది. టైటిల్ ను కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. ఈ టోర్నీలో అసాధరణమైన రీతిలో ఆడి పలువురి మన్ననలు పొందింది .
