వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం ప్ర‌పంచ క్రికెట్ లో సంచ‌ల‌నం

అండ‌ర్ -19 ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ కైవ‌సం

hellotelugu-IndiaUnder-19

జింబాబ్వే : భార‌త క్రికెట్ కు చెందిన కుర్రాళ్లు మ‌రోసారి మెరిశారు. అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. ఐసీసీ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపారు. అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నారు. ఒక‌టా రెండా ఏకంగా 412 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఫైన‌ల్ లో ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ జ‌ట్టు ముందు ఉంచారు. దెబ్బ‌కు టార్గెట్ ను ఛేదించ‌లేక చ‌తికిల ప‌డింది. దీంతో 100 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. విశ్వ విజేత‌గా నిలిచింది ఆయుష్ మాత్రే సార‌థ్యంలోని అండ‌ర్ 19 జ‌ట్టు. ఇదిలా ఉండ‌గా క్రికెట్ లో వ‌స్తూనే రికార్డుల మోత మోగించిన చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య వంశీ దుమ్ము రేపాడు. 14 ఏళ్ల త‌ను కేవ‌లం 80 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. రికార్డ్ స్థాయిలో 175 ర‌న్స్ చేశాడు. దీంతో ఇండియా భారీ స్కోర్ తో చుక్క‌లు చూపించింది.

సిక్సులు, ఫోర్ల‌తో రెచ్చి పోయాడు వైభవ్ . ఇందులో 15 ఫోర్లు , 15 సిక్స‌ర్లు ఉన్నాయి. దీంతో అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్ కూడా రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా ఐసీసీ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచు కోవ‌డం ప‌ట్ల దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి మ‌న కుర్రాళ్ల‌పై. జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు ప్రెసిడెంట్ ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీసీసీఐ అధ్య‌క్షుడు , కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా, ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మ‌న్ జే షా.

 

Exit mobile version