Womens World Cup : ముంబై – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. త్వరలో జరగబోయే మహిళల ప్రపంచ కప్ లో పాల్గొనే భారత మహిళా జట్టును ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి సెలెక్షన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. ఎవరూ ఊహించని రీతిలో రేణుకా ఠాకూర్ (Renuka Thakur) కు చోటు దక్కింది. ఇదే క్రమంలో షఫాలీ వర్మకు చోటు దక్కక పోవడం విస్తు పోయేలా చేసింది. టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తారు. ఇదిలా ఉండగా మహిళల వన్డే వరల్డ్ కప్ సెప్టెంబర్ 30న భారత్ , శ్రీలంకతో తలపడనుంది ఐసీసీ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
Womens World Cup Updates
వన్డే మహిళల ప్రపంచ కప్ (Womens World Cup) కోసం భారత జట్టులో టాప్-ఆర్డర్ బ్యాట్ విమన్ గా ఉన్నారు. ప్రతీకా రావల్‌తో పాటు చేర్చబడ్డారు. అయితే కానీ బిగ్-హిట్టర్ గా గుర్తింపు పొందిన షఫాలీ వర్మను జట్టులో చేర్చలేదు . మరో వైపు 14 వన్డే మ్యాచ్ లు ఆడింది రావల్. ఇదే సమయంలో బీసీసీఐ ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలకు కూడా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 14న ప్రారంభం అవుతుంది. ఇక్కడి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జట్టును ప్రకటించిన తర్వాత హర్మన్‌ప్రీత్ , చీఫ్ సెలెక్టర్ నీతు డేవిడ్ మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ టైటిల్‌ను ఎప్పుడూ గెలవని భారతదేశం స్వదేశంలో గెలవాల్సిన ఒత్తిడిలో ఉంటుందన్నారు. గాయం కారణంగా షఫాలీ వర్మను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే ఆమె సేవలను వాడుకుంటామన్నారు. రేణుకా రావల్ ఇప్పుడు జట్టు పరంగా కీలకమైన ప్లేయర్ అంటూ స్పష్టం చేశారు. ఇక జట్టు పరంగా చూస్తే హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతీ రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, శ్రీకా యాదవ్ (వికెట్ కీపర్), భానే యాస్ట్ రానా ఉన్నారు.
ఇక ఆస్ట్రేలియాతో ఆడే జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతీ రెడ్డి, రిచా ఘోష్ (డబ్ల్యుకె), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, శ్రీ డబ్ల్యూకె ఎస్‌ఎస్‌ఘారే, రాధిక యాదవ్ రానా ఆడతారు.
Also Read : Donald Trump Sensational Update : ఉక్రెయిన్ కు అమెరికా దళాలు పంపించం



















