గౌహతి : ఐపీఎల్ 2026లో భాగంగా అత్యంత కీలకమైన మూడో లీగ్ మ్యాచ్ మార్చి 20న సోమవారం గౌహతి లోని బర్సపారా స్టేడియంలో జరగనుంది. ఇప్పటి వరకు రెండు లీగ్ మ్యాచ్ లు జరిగాయి. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఎస్ ఆర్ హెచ్ ఓటమి పాలైంది. ఇక రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓడి పోయింది. ఇప్పుడు మూడో మ్యాచ్ కు సిద్దమయ్యాయి రాజస్తాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు. చెన్నై నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లు సామ్ కరణ్, రవీంద్ర జడేజాలు రాజస్తాన్ రాయల్స్ కు వచ్చారు. ఇక రాజస్తాన్ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన సంజు శాంసన్ ను భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది.
ఇక కండరాల గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడని సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. దీంతో మొత్తం భారమంతా ఇప్పుడు సంజు శాంసన్ పైనే పడింది. మరోవైపు నిరాశ పరిచిన ఐపీఎల్ 2025 సీజన్ల తర్వాత, రెండు జట్లు ఐపీఎల్ 2026 ఆరంభంలోనే తమ గుర్తింపును పునరుద్ధరించు కోవాలని చూస్తున్నాయి. రెండవ భాగంలో మంచు కురిసే అవకాశం ఉన్నందున, ఇక్కడ ఛేజింగ్ చేసే జట్లు తరచుగా ప్రయోజనం పొందుతాయి. ఈ వేదికపై 165-185 పరుగుల మధ్య మొదటి ఇన్నింగ్స్ స్కోరు సాధారణంగా పోటీనిచ్చేదిగా ఉంటుంది.
జట్ల పరంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, లువాన్-డ్రే ప్రిటోరియస్, రియాన్ పరాగ్ (సి), షిమ్రోన్ హెట్మేయర్, రవీంద్ర జడేజా, ద్రువ్ జురేల్, ధృవ్ అర్చెర్ జురెల్, ద్రువ్ అర్చెర్ బి. బర్గర్ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆయుష్ మాత్రే , సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (సి), డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, మత్తోన్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, చాహర్ ఆడనున్నారు.
