చెన్నై : కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు , సామాజిక సేవలతో పేరు పొందిన లారెన్స్ రాఘవ ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాడు. ఇటీవలే తమిళనాడులో అగ్ర నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ పవర్ లోకి వచ్చింది. ఆ పార్టీకి కాంగ్రెస్, వీసీకే, ఐసీయుఎల్ తదితర పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంతో ప్రస్తుతం టీవీకే కూటమి సర్కార్ కొలువు తీరింది. ఈ తరుణంలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది టీవీకే. 234 స్తానాలకు గాను 108 సీట్లు సాధించింది టీవీకే . రెండు స్థానాలలో పోటీ చేసిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ రెండింటిలోనూ గెలుపొందాడు. ఇక ఏదో ఒక సీటు వదులు కోవాల్సిన పరిస్తితి నెలకొంది. తిరుచ్చి నియోజకవర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు సీఎం విజయ్. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి నటి త్రిష కృష్ణన్ కు ఛాన్స్ లభిస్తుందని ఆశించారు. కానీ అనుకోకుండా విజయ్ కొత్త పేరును ప్రతిపాదించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ అభ్యర్థి ఎవరో కాదు లారెన్స్ రాఘవ. దీనిపై సోషల్ మీడియాలో, ప్రచురణ, ప్రసార మాధ్యమాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మొత్తం ప్రచారంపై స్పందించారు నటుడు లారెన్స్ రాఘవ సోషల్ మీడియాలో ఆదివారం. తిరుచిరాపల్లి తూర్పు (Trichy East) నియోజకవర్గ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నానన్న వార్త వివిధ మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది. దీనిపై స్పష్టత కోరుతూ మీడియా మిత్రులు చాలామంది నన్ను ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు. కలవాలని కోరుతున్నారు. ఈ ఊహాగానాలు ఒక స్థాయికి చేరడంతో, దీనిపై నేను స్పందించాల్సిన అవసరం ఉందని భావించి ఈ విషయాన్ని తెలియ జేస్తున్నాను. ప్రస్తుతం నేను బెంజ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను, నా షెడ్యూల్ 10వ తేదీన పూర్తవుతుంది . నా తల్లి ఆశీస్సులతో, నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని 11వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తానని వెల్లడించారు లారెన్స్ రాఘవ.















