లక్నో : ఐపీఎల్ 19వ సీజన్ లో అసలైన మ్యాచ్ కు వేదిక కానుంది ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో . ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. లక్నో ఇప్పటికే పలు మ్యాచ్ లలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు రెడీ అయ్యింది. కానీ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే కు అగ్నిపరీక్ష ఎదుర్కొంటోంది. మే15వ తేదీ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఆడనుంది. టోర్నీలో ఇది 59వ మ్యాచ్. ఇప్పటికే ఇరు జట్లు ఇంతకు ముందు తలపడ్డాయి. చెన్నై చేతిలో ఓటమి పాలైంది లక్నో సూపర్ జెయింట్స్. స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. తను చివరి దాకా ఉండి గెలిపించాడు. ఇప్పుడు లక్నో కంటే చెన్నై కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
ఇక సిఎస్‌కె ప్లేఆఫ్ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, తొలి దశలోనే నిష్క్రమించిన ఎల్‌ఎస్‌జి తమ గౌరవాన్ని నిలబెట్టు కోవడానికి మాత్రమే ఆడుతోంది. ఎలాగైనా చెన్నైని ఓడించి పరువు పోకుండా కాపాడు కోవాలని లక్నో భావిస్తోంది. దీంతో అందరి కళ్లు ఈ మ్యాచ్ పై ఉన్నాయి. మరింత ఉత్కంఠ ను రేపుతోంది. ఇక జట్ల విషయానికి వస్తే రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్, మిడిల్-ఆర్డర్ వైఫల్యాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్‌ల ఓపెనింగ్ జోడి మాత్రమే నిలకడగా రాణిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ గాయాల ఆందోళనలతో పాటు అద్భుతమైన ఫామ్‌తో బరిలోకి దిగుతోంది. అతిథి జట్టుకు పెద్ద దెబ్బ ఏమిటంటే, ఆల్‌రౌండర్ జేమీ ఓవర్‌టన్ కుడి తొడ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే, వారి బ్యాటింగ్ లైనప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది, ముఖ్యంగా ఎల్‌ఎస్‌జితో జరిగిన గత మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ 13 బంతుల్లోనే రికార్డు స్థాయిలో అర్ధ సెంచరీ సాధించడంతో మరింత బలంగా ఉన్నాడు.


















