B R Naidu : తిరుపతి – పాతకాల్వ పేరూరు బండపై వెలసిన వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు (B R Naidu) స్పష్టం చేశారు. పేరూరు వకుళామాత ఆలయాన్ని టీటీడీ చైర్మన్ ,టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సందర్శించారు.
TTD Chairman B R Naidu Comments
ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు, క్యూ లైన్లు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై నివేదిక తయారు చేయాలని టిటిడి అధికారులకు సూచించారు. తక్షణం చేపట్టాల్సిన పనుల వివరాలను తమ దృష్టికి తీసుకువస్తే టిటిడి బోర్డులో చర్చించి ఆమోదం తెల్పుతామని చెప్పారు టీటీడీ చైర్మన్.
అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ కు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేపట్టి అమ్మవారి శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం బీఆర్ నాయుడు మాట్లాడారు. అన్ని విధాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుఉందన్నారు. త్వరగా నివేదిక అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : MLA Raj gopal Reddy Shocking Comments : పదేళ్ల పాటు తానే సీఎం అంటే ఎలా..?
