హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అంటే జడుసుకుంటోంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే తెలంగాణ మీ అబ్బ జాగీరా అంటూ అవాకులు చెవాకులు పేలడమే కాకుండా సీరియస్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ పై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబోయే నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలని అనుకోవడం లేదని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఎట్టుకుంది. అక్కడ సీట్లు గెలిచింది. తమ పార్టీకి చెందిన సత్య కుమార్ యాదవ్ కు కేబినెట్ లో చోటు దక్కించుకుంది. ఇదే ప్లాన్ ను అమలు చేయాలని అనుకుంటోంది బీజేపీ. ఇందుకు పావులు కదిపే పనిలో పడింది. ఇక తెలంగాణలో బలమైన క్యాడర్ తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. బలమైన ప్రతిపక్షంగా ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాల గురించి మాత్రం ఎక్కడా ప్రశ్నించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బలమైన నాయకులు ఉన్నప్పటికీ వారి మధ్య ఆధిపత్య పోరు చివరకు పార్టీ బలపడేందుకు అవరోధంగా మారిందన్న విమర్శలు లేక పోలేదు. తాజాగా మరో విశ్వసనీయ సమచారం వచ్చింది. పార్టీ అంతర్గత సమావేశంలో జాతీయ నాయకుల సమక్షంలోనే జనసేన తో పొత్తు వద్దంటూ తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టం చేసినట్లు టాక్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో పలువురు బీజేపీ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజలు జనసేనను ‘తెలంగాణ వ్యతిరేక’ పార్టీగా చూస్తున్నారని, అటువంటి పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే, తమను కూడా తెలంగాణ వ్యతిరేకులుగానే ప్రజలు భావిస్తారని వారు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ హిందుత్వ గురించి మాట్లాడినప్పటికీ, దానివల్ల పెద్దగా మార్పు ఉండదని, ఇక్కడి ప్రజలపై అది ఎలాంటి ప్రభావం చూపదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు నేతలు మాట్లాడుతూ పొత్తు లేకుండానే పరోక్ష మద్దతు తీసుకోవాలని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే అది పార్టీకి వినాశకరంగా మారుతుందని హెచ్చరించారు. చివరగా పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేయాలని చర్చకు వచ్చినప్పుడు, వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వాలని, అలాగే మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గంలో జనసేన మద్దతు తీసుకోవాలని కొందరు సూచించినట్లు సమాచారం.
