వీధి కుక్క‌ల్ని చంపేసే హ‌క్కు మీకెక్క‌డిది..?

సుప్రీంకోర్టు తీర్పుపై రేణు దేశాయ్ సీరియ‌స్

hellotelugu-RenuDesai

హైద‌రాబాద్ : ఎంతో సౌమ్యంగా ఉండే ప్ర‌ముఖ న‌టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఉన్న‌ట్టుండి ఉగ్ర రూపం దాల్చారు. త‌ను శివాలెత్తిపోయారు. తాజాగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువరించింది వీధి కుక్క‌ల వ్య‌వ‌హారంపై . దీనిపై తీవ్రంగా స్పందించింది రేణు దేశాయ్. ఆమె మీడియాతో మాట్లాడారు. వీధి కుక్క‌ల‌ను చంపేసే హ‌క్కు మీకు ఎవ‌రు ఇచ్చారంటూ నేరుగా ప్ర‌శ్నించింది. రేణు దేశాయ్ చేసిన తాజా కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీకు అస‌లు బుద్ది అనేది ఉందా అంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం వీధి కుక్క‌ల సంఘ‌ట‌న‌ల‌పై దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ప్ర‌తిరోజూ ఎక్క‌డో ఒక చోట వీధి కుక్క‌ల బారిన ప‌డి కొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కొంద‌రు బాధితులు కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. చివ‌ర‌కు ఇది స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం దాకా వెళ్లింది. దీనిపై ప‌లుమార్లు విచార‌ణ జ‌రిపింది సుప్రీంకోర్టు. ఇక నుంచి వీధి కుక్క‌లు గ‌నుక క‌రిస్తే, లేదా గాయ‌ప‌రిచినా అందుకు సంబంధించి పూర్తి న‌ష్ట ప‌రిహారం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలే చెల్లించాల‌ని తీర్పు చెప్పింది. ఒక‌వేళ కుక్క‌ల‌పై ప్రేమ గ‌నుక ఉంటే వాటిని త‌మ ఇళ్ల‌ల్లోకి తీసుకు వెళ్లి పెంచాల‌ని సూచించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స్పందించారు రేణు దేశాయ్. హైద‌రాబాద్ లోని ప్రెస్ క్ల‌బ్ లో రేణుతో పాటు ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మి కూడా పాల్గొంది. జంతు ప్రేమికులు సైతం ఈ చ‌ర్య‌ను ఖండిస్తున్నారు. రేణుకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

Exit mobile version