Minister Savitha : విజయవాడ : చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరు ధరించాలని పిలుపునిచ్చారు మంత్రి సవిత (Minister Savitha). దేశంలో అన్ని ప్రాంతాల నుంచి విభిన్న రకాల చేనేత వస్త్రాలను నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా చేనేత, హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజు రోజుకు చేనేత వస్త్రాలకు ఆదరణ పెరుగుతోందన్నారు. తమ ప్రభుత్వం వీవర్స్ కోసం అనేక పథకాలను తీసుకు వచ్చిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా చేనేత వస్త్రాలు రూపొందించడం జరిగిందన్నారు.ప్రజల్లో కూడా చేనేత వాడకంపై మమకారం పెరుగుతుందని చెప్పారు. నేతన్నలకు 90 శాతం సబ్సిడీతో ఉపకరణాలు అందచేస్తున్నట్లు తెలిపారు. నేతనల్న కుటుంబాలకు నెలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల చొప్పున ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
Minister Savitha Key Comments
విజయవాడలోని శ్రీ శేష సాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన గాంధీ బునకర్ మేళా (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2025) ను మంత్రి ఎస్. సవిత, ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైందన్నారు. నేతన్నల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేతన్నలను ఆదుకునేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి నెలా చేనేత, హస్తకళల అభివృద్ధికి ఎగ్జిబిషన్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా తయారీదారులే ప్రత్యక్షంగా చేనేత ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే చేనేత వస్త్రాలు లభిస్తాయన్నారు.
Also Read : Minister Atchannaidu – Urea Interesting Update : పారదర్శకంగా యూరియా పంపిణీ : అచ్చెన్నాయుడు















