రాజస్థాన్ : ఐపీఎల్ 2026లో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఇప్పుడు ఈ జట్టు హాట్ ఫెవరేట్ గా ఉంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నా ఆశించిన మేర పరుగులు తీయడం లేదు. మరో వైపు తనను టీజ్ చేస్తూ వస్తున్న రియాన్ పరాగ్ ఇప్పుడు స్కిప్పర్ గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన సారథ్యంలో రెండు బలమైన జట్లను ఓడించడంతో తన పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ఇది పక్కన పెడితే ఐపీఎల్ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో బలమైన శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ను చివరి నిమిషంలో మట్టి కరిపించారు.
మ్యాచ్ లో ఉత్కంఠ భరిత విజయం సాధించిన అనంతరం రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజం చెప్పాలంటే, ఒక దశలో మేము ఈ మ్యాచ్‌లో దాదాపు ఓడిపోతామేమో అని నేను అనుకున్నాను. కానీ చివరి రెండు ఓవర్లలో జోఫ్రా ఆర్చర్ , తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసిన తీరు కట్టి పడేసిందన్నాడు. ముఖ్యంగా తుషార్ దేశ్‌పాండే వేసిన ఆఖరి ఓవర్ అత్యంత అద్భుతంగా ఉండటం వల్లనే గెలిచామన్నాడు. ఇవాళ మా విజయంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నాడు.. ఈ విజయం యొక్క పూర్తి ఘనత ఎవరికైనా దక్కాలంటే, అది వారికే దక్కుతుంది. ఈ విజయంతో, మేము ఇప్పుడు లీగ్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నామని తెలిపాడు..
