కేరళ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేరళలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేము ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించ బోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తప్పకుండా తమకు 100కు పైగా శాసన సభ స్థానాలు వస్తాయని అన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని, ఈ మేరకు వారు తప్పకుండా మార్పు కోరుకుంటున్నారని, ఆ విషయం ఏనాడో అర్థమై పోయిందన్నారు కేసీ వేణుగోపాల్.
గత 10 ఏళ్లుగా పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా కొనసాగడం పట్ల వారు విసిగి పోయారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజల ముందున్న ప్రశ్న ఏమిటంటేప్రజా వ్యతిరేకి, అహంకారి అయిన ఈ ముఖ్యమంత్రి మరో 5 ఏళ్లు కొనసాగాలా, వద్దా? అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతూ వచ్చిందన్నారు. ప్రజలు మాత్రం అస్సలు వద్దు’ అని స్పష్టం చేస్తున్నారు. మాకు నలుమూలల నుండి వినిపిస్తున్న సమాధానం ఇదే. అయ్యప్ప స్వామికి చెందిన బంగారాన్ని అపహరించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం ఆ నేరస్తుడిని, ఆ కేసును కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. … బంగారు చోరీకి పాల్పడిన నేరస్తులకు అండగా నిలిచిన ప్రభుత్వం తమకు వద్దని ‘ప్రజా న్యాయస్థానం’ తీర్పు చెప్ప బోతోందన్నారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇక ప్రజలు ఎంత మాత్రం పినరయ్ విజయన్ ఆ పదవిలో ఉండేందుకు వీలు లేదని డిసైడ్ అయ్యారని, ఆ విషయం ఓటింగ్ లో తేలి పోయిందన్నారు. ఇక దీని గురించి మాట్లాడాల్సింది ఏమీ లేదన్నారు కేసీ వేణుగోపాల్.
