ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాం : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

విద్య‌, వైద్యం , ఉపాధి త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త

hellotelugu-Kavitha

హైద‌రాబాద్ : తెలంగాణలో విద్య, వైద్యం కోసమే ప్రజలు 60 శాతం డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ప్రభుత్వం కచ్చితంగా సంకల్పం తీసుకుంటే ఇది సాధ్యమేనని చెప్పారు. ఆరోగ్య శ్రీ ప్రారంభినప్పుడు, విద్యార్థులకు ఫ్రీ మీల్స్ పెట్టినప్పుడు కూడా ఇది సాధ్యమా అంటూ చాలా ప్రశ్నలు వచ్చాయన్నారు. కానీ ఇప్పుడు వాటిని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పాంచజన్యంలోని ఐదు అంశాలను అమలు చేయటంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని కవిత చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను తమ ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయవచ్చన్నారు. ఆ విధంగా చూస్తే చేయాలన్న సంకల్పం ఉంటే చాలు ఇదంతా సాధ్యమేనని స్పష్టం చేశారు.

తల్లిలా తాను పరిణితి చెందుతానంటే చాలా మంది విమర్శలు చేశారని కవిత గుర్తు చేశారు. కానీ తల్లి మాదిరి లాలన లేని కారణంగానే ఇవ్వాళ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తే మాత్రమే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం వస్తుందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అది చేతకావటం లేదన్నారు. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తామన్నారు. ఇటీవల కేసీఆర్ పై కవిత చేసిన విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చారు. తన విమర్శలు కేవలం బీఆర్ఎస్ అధినేత, రాజకీయ నేత అయిన కేసీఆర్ పైనేనని చెప్పారు.

Exit mobile version