హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు బండి భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. తనను జడ్జి ముందు హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించారు. దీనిపై స్పందించారు బండి సంజయ్. కొడుకు చేసిన లంగ పనులను సమర్థించేలా మాట్లాడటం విడ్డూరం. చట్ట పరంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. అంతే కాదు తనను రక్షించుకుంటానని చెప్పారు. ఎక్కడా తప్పు చేశాడన్న సోయి లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మరో వైపు ప్రజా సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు. మరో వైపు జడ్జి బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక లొంగి పోయాడు భగీరథ్. తనను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు.
తమ కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయవ్యవస్థ ద్వారా తమను తాము నిర్దోషులుగా నిరూపించుకుంటామని గట్టిగా నొక్కి చెప్పారు. తన కుమారుడు బండి బగీరత్ తనపై నమోదైన ఆరోపిత పోక్సో కేసు విచారణలో చేరిన తర్వాత, తన కుటుంబం ఒక వారం పాటు తీవ్రమైన భావోద్వేగ, వ్యక్తిగత గందరగోళాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో మౌనం వీడారు. కాగా భావోద్వేగ ఒత్తిడి కారణంగా తన తల్లి గుండెపోటుకు కూడా గురయ్యారని బండి సంజయ్ వాపోయారు. మా వైపు నుండి ఎలాంటి తప్పు జరగలేదు” అని ఆయన తన మద్దతుదారులకు భరోసా ఇస్తూ, న్యాయ ప్రక్రియ పట్ల తన అచంచలమైన నిబద్ధతను నొక్కి చెప్పారు.”గడిచిన వారం రోజులుగా, మా కుటుంబం మా జీవితంలోనే అత్యంత భావోద్వేగభరితమైన కష్టతరమైన దశల్లో ఒకదానిని ఎదుర్కొంది. బాధ, ఆందోళన, నిస్సహాయత, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో కూడిన క్షణాలు ఉన్నాయి. ఈ పరిస్థితి మా కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. దీనిని చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రతిజ్ఞ చేశారు.

















