ఆంధ్ర నేత‌ల విగ్ర‌హాలు పార్సిల్ చేస్తాం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత

hellotelugu-Kavitha

హైద‌రాబాద్ : తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా తమ అస్తిత్వంపై దాడియే అన్నారు. తమతో పెట్టుకుంటే గతంలో తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. మరోసారి తమ జోలికి వస్తే ఈసారి పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నఆంధ్రా నాయకుల విగ్రహాలను తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పగలకొట్టి మరీ పార్సిల్ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎంతో సహన శీలురుని… అందుకే ఇప్పటికీ కూడా ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఇక్కడ ఉన్నప్పటికీ గౌరవిస్తున్నామన్నారు. కానీ శృతి మించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కవిత హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతున్నట్లుగానే ఆంధ్రాలో తెలంగాణ నాయకుల విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు. పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహా తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్ అని కవిత ఆరోపించారు. ఆయన సహకారంతోనే తెలంగాణపై ఆంధ్రా నాయకులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన మొదట్లో ఈ ప్రాంతం గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో అప్పటి నుంచి మళ్లీ కుట్రలు మొదలయ్యాయన్నారు. తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వర్, పాశం యాదగిరి లాంటి వాళ్లు తమ విశ్లేషణలు చేస్తే ఆంధ్రా పోలీసులు ఇక్కడకు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పే ధైర్యం చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని …కానీ ఆంధ్రా రాజకీయ నాయకులతో మాత్రం సమస్య ఉందన్నారు. తెలంగాణ సెక్రటేరియేట్ లో, ఇక్కడి రాజకీయాల్లో వేలు పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కవిత తేల్చి చెప్పారు.

Exit mobile version