బీసీలను పారిశ్రామిక‌వేత్త‌లుగా త‌యారు చేస్తాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

hellotelugu-SSavitha

అమరావతి : అయిదేళ్లలో వెనుకబడిన తరగతులకు జగన్ చేసింది శూన్యం అని, బీసీలకు పునాదులు వేయ‌డ‌మే కాకుండా, వారిని అభివృద్ది చేసింది కూడా తామేనంటూ రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. 2014-19లో వడ్డెర్లకు, రజకులకు, మత్స్యకారులతో ఇతక బీసీ కులాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలోనూ బీసీలకు పెద్దపీట వేస్తున్నామని, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. గతంలో ఆదరణ, ఆదరణ 2.0 పథకాలను ప్రారంభించిన ఘనత సీఎం చంద్రబాబు దేనన్నారు.

త్వరలో ప్రారంభించబోయే ఆదరణ 3.0లో వడ్డెర్లకు ప్రాధాన్యత ఇస్తున్న‌ట్లు చెప్పారు మంత్రి ఎస్ . స‌విత‌. వడ్డెర్లకు మైనింగ్ లీజు కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లు, సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని , వాటికి సంబంధించిన ఫైళ్లు ఆర్జిక శాఖ వద్ద ఉన్నాయని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు (పల్లెకారులు) ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇలా రాష్ట్రంలో ఉన్న 1.20 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. మత్స్య కారులు చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల వరకూ బీమా చెల్లిస్తున్నామన్నారు. మత్స్యకారుల మర పడవులకు వినియోగించే లీటర్ డీజిల్ పై రూ.9లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మత్స్య కారుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామని వెల్ల‌డించారు స‌విత‌. మత్స్య కారుల పడవలు మరమ్మతులకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

Exit mobile version