బీజేపీ బ‌లోపేతంపై దృష్టి సారిస్తాం : నితిన్ న‌బిన్

క‌ష్ట‌ప‌డ్డ వారికే ప్ర‌యారిటీ ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న

hellotelugu-NitinNabin

ఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడిగా కొలువు తీరిన బీహార్ కు చెందిన మంత్రి నితిన్ న‌బిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ వ్యాప్తంగా సంస్థాగ‌త ప‌రంగా మ‌రింత పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. పార్టీ చీఫ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత బాధ్యుల‌తో కీల‌క మీటింగ్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు, బాధ్యులు, నేత‌లు విధిగా ఆయా ప్రాంతాల‌లో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి మ‌రోసారి రావాల‌ని ఇందు కోసం ఇప్ప‌టి నుంచే కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం క‌ష్ట ప‌డిన వారికి త‌ప్ప‌కుండా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. పైర‌వీల‌కు, సిఫార్సుల‌కు తావు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు బీజేపీ అధ్య‌క్షుడు నితిన్ నబిన్. యువ నాయ‌క‌త్వానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఇత‌ర పార్టీల‌తో బీజేపీకి పోటీ అన్న‌ది లేద‌న్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడైన న‌రేంద్ర మోదీ, బ‌ల‌మైన వ్య‌క్తి అమిత్ చంద్ర షా మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో బీజేపీకి ఢోకా లేద‌న్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ , త‌దిత‌ర పార్టీల‌ను ఏకి పారేయాల‌ని అన్నారు. ఏది ఏమైనా పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు నితిన్ న‌బిన్.

Exit mobile version