అయిదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తాం

మంత్రి ఎస్. స‌విత కీల‌క ప్ర‌క‌ట‌న

hellotelugu-SSavitha

అమ‌రావ‌తి : ఇచ్చిన మాట మంత్రి నారా లోకేష్ నిల‌బెట్టుకున్నార‌ని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌.
అధికారంలోకి రాగానే 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించారన్నారు. జగన్ సహా వైసీపీ నాయకులు కోర్టుల్లో ఎన్ని కేసులు వేసినా, వాటిన్నింటినీ అధిగమించి మెగా డీఎస్సీ నిర్వహించారని నారా లోకేశ్ ను కొనియాడారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు. బాబుతోనే జాబ్ గ్యారంటీని అనే నినాదాన్ని మాటలతో సరిపెట్టకుండా నిజం చేస్తున్నామన్నారు. ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని మండిపడ్డారు.

అంతకు ముందు సోమందేపల్లిలో వెలసిన చౌడేశ్వరీ దేవిని మంత్రి సవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి సోమందేపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. జాతర ఏర్పాట్లు, సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. వారంతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తనను కలిసి విలేకరులతో మాట్లాడుతూ, జాతర ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులను అభినందిస్తూ, జాతర సజావుగా నిర్వహణకు ఆలయం వరకూ సీసీ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. సోమందేపల్లి మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి కల్పన వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

Exit mobile version