కర్ణాటక : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. రైతుల ప్రయోజనాలను కర్ణాటక, ఏపీ, తెలంగాణ కాపాడతాయని స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్లను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. బహిరంగ సభకు ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు వివిధ గేట్లను లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్ 17వ గేటును, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 18వ గేటును ప్రారంభించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 19వ గేటును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వ గేటును ప్రారంభించారు. నీటి పారుదల శాఖ , తుంగభద్ర బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు , అధికారులు హాజరయ్యారు.
రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ చారిత్రాత్మక ఏకాభిప్రాయానికి వచ్చాయని శివకుమార్ పేర్కొన్నారు. కొప్పల్ జిల్లాలోని మునిరాబాద్‌లో జరిగిన సభలో ప్రసంగిస్తూ రిజర్వాయర్‌కు సంబంధించిన అంశాలు , ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలపై మూడు రాష్ట్రాలు విస్తృత చర్చలు జరిపాయని డీకే శివకుమార్ తెలిపారు. ఆగస్టు 2024లో, కొప్పల్ జిల్లాలోని ఈ రిజర్వాయర్‌కు చెందిన ఒక క్రెస్ట్ గేట్ (19వ గేటు) చైన్ లింక్ తెగిపోవడంతో అది కొట్టుకు పోయిందని చెప్పారు. దీనివల్ల భారీగా నీరు విడుదల కావడంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాల్సి వచ్చిందన్నారు. రుతుపవనాల సమయంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
