Sudha Reddy : హైదరాబాద్ : స్ట్రైడ్ అండ్ షైన్ నినాదంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) ఫౌండేషన్, సుధారెడ్డి (Sudha Reddy) ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఆదివారం బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పింక్ పవర్ మారథాన్ రన్ విజయవంతమైంది. చిన్నారుల నుంచి వృద్ధులు, వికలాంగుల వరకు వేల సంఖ్యలో ఈ రన్ లో తాము సైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పింక్ పవర్ రన్ లో పాల్గొనే వారి రాకతో నెక్లెస్ రోడ్ పరిసరాలు సందడి సందడిగా కనిపించాయి. రన్ లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు పింక్ రంగు టి షర్ట్స్ ను ధరించటంతో ఈ ప్రాంతం అంతా పింక్ మయం అయ్యింది. చుట్టూ పచ్చని మొక్కలు, చెట్లు, పూల మొక్కలు, నిండు కుండలా ఉన్న హుస్సేన్ సాగర్ అంచున జరిగిన రన్ చల్లటి వాతావరణంలో హైదరాబాద్ నగరంలో సుందర దృశ్యాన్ని ఆవిష్కరించింది.
Sudha Reddy Pink Power Run Updates
పింక్ పవర్ రన్ నిర్వాహకులు ఎంఈఐఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్లు సుధా రెడ్డి , పీ వీ కృష్ణారెడ్డి, మిస్ వరల్డ్, వివిధ ఉపఖండాల సుందరీమణులు , ప్రపంచ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు జయేష్ రంజన్ , దాసరి హరిచందన, సీనియర్ ఐ పీ ఎస్ అధికారి తరుణ్ జోషి తో పాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఈ రన్ లో భాగస్వాములు అయ్యారు. తొలుత 10 కిలోమీటర్లు, అనంతరం ఐదు కిలోమీటర్లు, చివరగా మూడు కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. ప్రతి పరుగుకు ముందు అంతర్జాతీయ ఫిట్ నెస్ నిపుణులు పరుగులో పాల్గొన్న వారిని ఉత్సాహ పరిచేలా మెళుకువలు నేర్పించారు. మిస్ వరల్డ్ 2025 ఒపెల్ సుచేత , మిస్ ఆసియా కృష్ణహ్ , సుధా రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి, జయేష్ రంజన్ , తరుణ్ జోషి, లియాండర్ పేస్, దాసరి హరి చందన, మిస్ వరల్డ్ ఆర్గనైజషన్ చైర్ పర్సన్ జూలియా తదితరులు వివిధ కేటగిరీల పరుగు పందాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు.
Also Read : BCCI New President Important Update : బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్



















