మాట వినకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తాం

అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

hellotelugu-Trump

అమెరికా : ఇజ్రాయెల్ మ‌రోసారి అమెరికా మద్దతుతో రెచ్చి పోయింది. ఏకంగా మిస్సైల్స్ తో విరుచుకు ప‌డింది ఇరాన్ పై. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. మ‌ధ్య ప్రాచ్య దేశాల‌న్నీ అప్ర‌మ‌త్తం అయ్యాయి. దుబాయ్ లో ముందు జాగ్ర‌త్త‌గా ఎయిర్ పోర్టును మూసి వేశారు. దీంతో ఇత‌ర దేశాల‌కు, ప్రాంతాల‌కు వెళ్లే ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే నిలిచి పోయారు. బిక్కు బిక్కుమంటూ బ‌తుకుతున్నారు. మ‌రో వైపు ఇరాన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్ప‌టి వ‌ర‌కు ఇరాన్ ప‌ట్ల సానుకూల‌తతో ఉన్నామ‌ని, కానీ ఇక నుంచి ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు .

ఇరాన్ ను నామ రూపాలు లేకుండా చేస్తామ‌న్నారు ప్రెసిడెంట్. అమెరికా జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్ర‌సంగించారు. ఇరాన్‌పై అమెరికా భారీ సైనిక చర్యలకు దిగిందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పాలకుల నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారు అని, ఇటీవల నిరసనలు చేస్తున్న సొంత పౌరులనే వీధుల్లో చంపేసిందని ధ్వజమెత్తారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి అణు ఆయుధాలు ఉండకూడదని చెప్పారు. వాటి కోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలని, తమ మాట వినకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండ‌గా ఇరాన్ చీఫ్ ఖ‌మోనీని లేపేసిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

Exit mobile version